Site icon HashtagU Telugu

Ram Charan Game Changer : దసరాకి గేమ్ చేంజర్.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదా..?

Thaman Crazy Comments on Ram Charan Game Changer movie

Thaman Crazy Comments on Ram Charan Game Changer movie

Ram Charan Game Changer దిల్ రాజు నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో రాం చరణ్ హీరోగా చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. 200 కోట్ల బడ్జెట్ తో భారీ కాన్వాస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ వైజ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ ఆ సినిమా తర్వాత వచ్చిన ఆచార్యతో నిరాశ పరచాడు. అఫ్కోర్స్ ఆ సినిమాలో చరణ్ పాత్ర తనవరకు బాగానే చేసినా రిజల్ట్ మాత్రం ఫెయిల్ అయ్యింది. ఆచార్య జ్ఞాపకాలను చెరిపేస్తూ గేమ్ చేంజర్ తో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమా అప్డేట్స్ విషయంలో మేకర్స్ చూపిస్తున్న అశ్రద్ధ మెగా ఫ్యాన్స్ ని ఫైర్ అయ్యేలా చేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. సినిమా అక్టోబర్ 2న కానీ, అక్టోబర్ 15న కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఎలాగు సినిమా పొలిట్కల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి అందులోనూ శంకర్ మార్క్ సోషల్ కాజ్ ఉంటుంది కాబట్టి సినిమ ను అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఒకవేళ అలా కుదరకపోతే మాత్రం దసరాకి రిలీజ్ ఫిక్స్ చేయాలని ప్లాన్. గేమ్ చేంజర్ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం మరోసారి చరణ్ నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ పై చెడుగుడు ఆడేస్తాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో చరణ్ తో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శ్రీకాంత్, ప్రభు, సునీల్ ఇంకా చాలామంది స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తుంది.

Also Read : NTR Devara : దేవర OTT డీల్ క్లోజ్.. డిజిటల్ రైట్స్ లో దుమ్ము దులిపేస్తున్న ఎన్.టి.ఆర్..!

గేమ్ చేంజర్ తర్వాత చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా పీరియాడికల్ డ్రామాగా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటికే వారు నిర్మించిన పుష్ప 1 పాన్ ఇండియా హిట్ కాగా పుష్ప 2 కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చరణ్ తో ఆ రేంజ్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి సంస్థ. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు రావాల్సి ఉంది.