Site icon HashtagU Telugu

Game Changer : బాలీవుడ్‌లో రికార్డు సృష్టించిన స్టాండ్ ఎలోన్ సినిమాలు ఇవే.. RRR తరువాత గేమ్ ఛేంజర్..

Ram Charan Game Changer Record Theatrical Business In Bollywood After Rrr

Ram Charan Game Changer Record Theatrical Business In Bollywood After Rrr

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’.. బాలీవుడ్ లో అదిరిపోయే థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా నార్త్ బెల్ట్ రైట్స్ ని ఆల్మోస్ట్ 75 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారట. స్టాండ్ ఎలోన్ సినిమాల్లో RRR తరువాత గేమ్ ఛేంజర్‌దే రికార్డు అని చెప్పాలి.

ఇంతకీ స్టాండ్ ఎలోన్ సినిమాలు అంటే ఏంటి..? స్టాండ్ ఎలోన్ సినిమాలు అంటే.. ఆ మూవీకి కొనసాగింపుగా మరో సినిమా లేకుండా, సింగల్ పార్ట్ సినిమాగా ఆడియన్స్ ముందుకు వస్తే.. దానిని స్టాండ్ ఎలోన్ సినిమా అంటారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆడియన్స్ ముందుకు స్టాండ్ ఎలోన్ చిత్రంగానే వచ్చింది. ఇక ఈ మూవీ నార్త్ థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇలా సింగల్ వచ్చిన సినిమాలు హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ థియేట్రికల్ బిజనెస్ చేసిందో ఒకసారి చూసేయండి.

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన స్టాండ్ ఎలోన్ సినిమా ‘సాహో’. ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ 65 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆ తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన మరో రెండు సింగల్ సినిమాలు.. ‘రాధేశ్యామ్’ 50 కోట్ల, ‘ఆదిపురుష్’ 72 కోట్ల బిజినెస్ చేశాయి. వీటి తరువాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్దకి వెళ్ళబోతున్న మరో టాలీవుడ్ సింగల్ ఎలోన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’.

ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ కి ఓ రేంజ్ లో బిజినెస్ జరిగింది. దాదాపు 75 కోట్లు ఇచ్చి ఈ మూవీ హిందీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. ఈ ధరతో అత్యధిక బిజినెస్ జరుపుకున్న స్టాండ్ ఎలోన్ చిత్రాల్లో.. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ ఛేంజర్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఫ్రాంచైజ్‌లుగా వస్తున్న సలార్, కల్కి, దేవర చిత్రాలకు జరిగిన బిజినెస్ తో పోలిస్తే.. గేమ్ ఛేంజర్ కి జరిగిన బిజినెస్ రికార్డు అనే చెప్పాలి.

Also read : SSMB29 : ఎయిర్ పోర్ట్‌లో మహేష్, రాజమౌళి.. వీడియో వైరల్..