Game Changer : ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకుడు కావడం, మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందించడంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. కమల్ హాసన్ ఇండియన్ సినిమాలు వల్ల గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా పూర్తీ అవ్వడంతో.. శంకర్ టీం అంతా తమ ఫుల్ ఫోకస్ ని గేమ్ ఛేంజర్ పై పెట్టారు.
ఇప్పటికే రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ ని మొత్తం పూర్తి చేసారు. ఇక మిగతా పాత్రలకు సంబంధించి మరో పదిహేను రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉంది. దీంతో శంకర్ ఆ షూటింగ్ పై ఫోకస్ పెట్టారు. ఇక తన డైరెక్షన్ టీంని ఏమో మూవీ పోస్టుప్రొడక్షన్ పై పెట్టారు. నేటి నుంచి ఈ పోస్టుప్రొడక్షన్స్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నట్లు.. ఈ మూవీ అసోసియేటివ్ డైరెక్టర్ మురళి మనోహర్ తెలియజేసారు. ఇక ఎట్టకేలకు పోస్టుప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవ్వడంతో.. చరణ్ అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
Love you all #RamCharan gaaru fans here! 😊❤️🙏🏼#GameChanger#RC15 https://t.co/y2WAOBcywN
— ச. முரளி மனோகர் / S. Murali Manohar (@kalaiyalan) July 18, 2024
ఫైనల్ ఎడిట్ పూర్తి అయితేగాని రిలీజ్ డేట్ ని ప్రకటించాను అంటూ శంకర్ ఇటీవల తెలియజేసారు. మరి ఆ ఫైనల్ కట్ త్వరగా పూర్తి అయితే రిలీజ్ డేట్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది. కాగా ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చేయడం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.