రామ్ చరణ్(Ram Charan) ఎప్పుడో రెండేళ్ల క్రితం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాని ప్రకటించారు. దిల్ రాజు(Dil Raju) తన నిర్మాణంలో 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అనేకమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.
కానీ గేమ్ ఛేంజర్ సినిమా మొదలైనప్పటి నుంచి అనేక కారణాలతో షూట్ వాయిదా పడుతూనే ఉంది. మధ్యలో శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా షూట్ కి వెళ్లడం, చరణ్ పాప పుట్టడంతో గ్యాప్ తీసుకోవడం.. ఇలా ఏవో ఒక కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ జరిగిందని ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉందని సమాచారం. ఇటీవలే మైసూరులో ఓ షెడ్యూల్ షూటింగ్ చేశారు.
ఇక సినిమా నుంచి ఒక్క టైటిల్ పోస్టర్ తప్ప ఇంకేమి రిలీజ్ చేయకపోవడం, ఓ సాంగ్ లీక్ అవ్వగా దాన్ని రిలీజ్ చేస్తా అని చేయకపోవడం, సినిమా నుంచి అప్డేట్స్ ఏమి ఇవ్వకపోవడంతో చరణ్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. సలార్ సినిమా చూసిన తర్వాత మీడియా.. దిల్ రాజుని గేమ్ ఛేంజర్ సినిమా రిలిజ్ ఎప్పుడు ఉంటుంది అని అడగగా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం అని చెప్పాడు. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. లేదా కొన్ని రోజులు వాయిదా వేసి దసరాకి రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read : Pallavi Prashanth : జైలు నుంచి బయటకి వచ్చి.. మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయిన ప్రశాంత్..