Site icon HashtagU Telugu

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు.. ఎక్కడ..?

Ram Charan Game Changer Movie Teaser Launch Event

Game Changer

Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ మూడేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మూవీ యూనిట్. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండు పాటలు, పలు పోస్టర్స్ కూడా రిలీజ్ చేసారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అయితే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారట. నవంబర్ 9వ తేదీనే గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. అయితే పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా అన్ని రాష్ట్రాల్లో చేయనున్నారు.

ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కు శంకర్, దిల్ రాజు తో పాటు రామ చరణ్, పలువురు నటీనటులు హాజరవుతారని సమాచారం. చెన్నై నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత పాన్ ఇండియా ప్రమోషన్స్ చేస్తారేమో. ఇక చరణ్ బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడతాడని గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

Also Read : Nitin : మాస్ ఇమేజ్ కోసం నితిన్ ప్రయత్నాలు.. ఈసారైనా ఫలిస్తాయా..?