Game Changer : మన తెలుగు సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ మార్కెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు వచ్చిన పాన్ ఇండియా సినిమాలు ఇక్కడ టాలీవుడ్ ప్రమోషన్స్ చేసుకొని ఇక్కడ సినిమా రిలీజ్ అయ్యాక వేరే దేశాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకి వేరే లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. నవంబర్ 9న లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ ఆ తర్వాత అమెరికా డల్లాస్ లో ఓ ఈవెంట్, ఆ తర్వాత చెన్నై, తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ ఉంటాయని తెలిపాడు.
దీంతో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కి ముందే అమెరికాలో ప్రమోషన్స్ చేస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. డల్లాస్ లో గేమ్ ఛేంజర్ కు భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి చరణ్ తో పాటు మూవీ యూనిట్ కూడా హాజరు కానున్నారు. సినిమా రిలీజ్ కి ముందే అమెరికాలో ఇక్కడ తెలుగులో చేసినట్టు ప్రమోషన్స్ చేస్తుండటంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తున్న మొదటి సినిమా గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం. మొత్తానికి గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ని దిల్ రాజు ఇంటర్నేషనల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారుగా. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.