Site icon HashtagU Telugu

Game Changer : హమ్మయ్య ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ వచ్చేసింది.. జరగండి.. జరగండి..

Ram Charan Game Changer Movie Jaragandi Song Released

Ram Charan Game Changer Movie Jaragandi Song Released

శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా రెండేళ్ల నుంచి సాగుతున్నా ఎలాంటి అప్డేట్స్ లేవు. షూటింగ్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వడం తప్ప మూవీ యూనిట్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో చరణ్ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.

నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసారు. గతంలో జరగండి.. జరగండి.. అంటూ ఓ పాట లీక్ అయింది. ఆ పాటని ఇప్పుడు అధికారికంగా రిలీజ్ చేసారు మూవీ యూనిట్. నేడు ఉదయం రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాటని విడుదల చేసారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ పాటని అనంత శ్రీరామ్ రాయగా థమన్ సంగీత దర్శకత్వంలో డాలర్ మెహందీ, సునిధి చౌహన్ పాడారు. ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. మీరు కూడా ఈ పాట వినేయండి.