RRR సినిమా తర్వాత రామ్ చరణ్(Ram Charan) డైరెక్టర్ శంకర్(Director Shankar) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనపడనున్నాడు. కియారా అద్వానీ(Kiara Advani), అంజలి(Anjali) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సెట్స్ నుంచి లీకైన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాను 2024 సంక్రాంతికి(Sankranthi) రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవల తెలిపారు.
డైరెక్టర్ శంకర్ ఒకేసారి కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా, చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆఫ్రికాలో కమల్ షూట్ పూర్తిచేసి గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కి షిఫ్ట్ అవుతున్నట్టు శంకర్ పోస్ట్ చేశారు. తాజాగా గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పై ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ షూట్ కోసం హైదరాబాద్ శివార్లలో స్పెషల్ సెట్స్ వేస్తున్నారు. త్వరలోనే ఈ షూట్ ప్రారంభం కానుంది.
రామ్ చరణ్ మగధీర సినిమాలో 100 మందితో చేసిన ఫైట్ ఇప్పటికి గుర్తుంది. ఈసారి గేమ్ ఛేంజర్ కోసం అంతకంటే భారీగా ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 1200 మందితో గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ ప్లాన్ చేయనున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక్కడి ఫైటర్స్ నే కాక కన్నడ నుంచి కూడా ఫైటర్స్ ని తెప్పిస్తున్నారని సమాచారం. దీంతో అభిమానుల్లో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి శంకర్ ఈ సినిమాని ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేశాడో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఇక ఈ షూట్ తర్వాత చరణ్ ఉపాసన డెలివరీ అయ్యేవరకు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు సమాచారం.
Also Read : Sai Dharam Tej : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. జనసేన గురించి ఏమన్నాడో తెలుసా??