Site icon HashtagU Telugu

Devara – Game Changer : చరణ్‌కి తన సినిమా తేదీని ఇచ్చేస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా..?

Ram Charan Game Changer Is Aiming Ntr Devara Release Date

Ram Charan Game Changer Is Aiming Ntr Devara Release Date

Devara – Game Changer : ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో బడా హీరోల నుంచి భారీ బడ్జెట్ సినిమాలే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ ‘ఓజి’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నాయి. కాగా ఓజి అండ్ దేవర.. తమ రిలీజ్ డేట్స్ ని ఆల్రెడీ అనౌన్స్ చేసేశాయి. సెప్టెంబర్ 27న ‘ఓజి’, అక్టోబర్ 10న ‘దేవర’ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.

అయితే ఓజి మూవీ షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ వస్తే గాని, అది కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. అయితే పవన్ మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి కొంచెం ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈక్రమంలో ఓజి మూవీ రిలీజ్ సెప్టెంబర్ రిలీజ్ అవ్వడం కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ మూవీ రిలీజ్ డేట్ ని దేవర తీసుకోవాలని చూస్తుందట. దేవర మూవీ దసరా పండుగ సమయంలో రిలీజ్ అయ్యేందుకు అక్టోబర్ 10ని ఎంచుకుంది.

ఒకవేళ ఈ తేదీ కంటే ముందే, ఓజి రిలీజ్ డేట్ లో వస్తే.. దేవరకి సింగల్ రిలీజ్ తో పాటు దసరా హాలిడేస్ కూడా బోనస్ గా దొరుకుతాయి. అందుకనే దేవర టీం ఓజి పోస్టుపోన్ వార్త కోసం ఎదురు చూస్తుంది. ఓజి వాయిదా వార్త రాగానే.. ఆ తేదీని దేవర ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక దేవర తన డేట్ ని వదిలేసి ముందుకు వెళ్లడంతో, ఇప్పటి వరకు విడుదల తేదీని అనౌన్స్ చేయని గేమ్ ఛేంజర్.. దేవర రిలీజ్ డేట్ అక్టోబర్ 10ని తీసుకోవాలని చూస్తుందట. ఈ రెండు సినిమాలకు ఇప్పుడు ఓజి వాయిదా వార్త కీలకంగా మారింది. మరి ఓజి ఏం చేస్తున్నాడో చూడాలి.

Also read : Allu Arjun Campaign: అల్లు అర్జున్‌ ని టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్