Site icon HashtagU Telugu

Game Changer : ఆగష్టులో గేమ్ ఛేంజర్ గ్లింప్స్ రిలీజ్ కాబోతుందా..?

Ram Charan, Game Changer, Game Changer Glimpse

Ram Charan, Game Changer, Game Changer Glimpse

Game Changer : రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. తమిళ్ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. గత మూడేళ్లుగా చిత్రకరణ జరుపుకుంటూనే ఉన్న ఈ సినిమా నుంచి ఒక రెండు పోస్టర్లు, ఒక సాంగ్ తప్ప.. మరే అప్డేట్ రాలేదు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు పూర్తీ కావొస్తుంది. మరో రెండు వారలు షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. చరణ్ కి సంబంధించిన షూటింగ్ అయితే మొత్తం పూర్తి అయ్యింది.

దింతో ఇప్పటినుంచి అయినా ఈ మూవీ రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే.. ఆగష్టు 15న గేమ్ ఛేంజర్ నుంచి గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ కాబోతుందంట. అయితే ఈ వార్త గురించి మూవీ టీం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే.. గ్లింప్స్, టీజర్ రిలీజ్ అనేది కేవలం రూమర్ మాత్రమే అంట. శంకర్ ఇటీవల చెప్పినట్లు.. ఫైనల్ ఎడిట్ ఓకే అయిన తరువాతే గ్లింప్స్ రిలీజ్ అయినా, విడుదల తేదీ అప్డేట్ అయినా.

ఈ మూవీ ఎడిటింగ్ పనులను ఈ వారమే మొదలు పెట్టారు. కాబట్టి ఆగష్టులో గేమ్ ఛేంజర్ నుంచి ఎటువంటి వీడియో అప్డేట్ లేనట్లే అని అర్ధమవుతుంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని, అంజలి వంటి స్టార్ కాస్ట్ నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.