Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గత మూడేళ్లుగా చిత్రకరణ జరుపుకుంటూనే వస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రామ్ చరణ్ కి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది. ఇక ఇతర పాత్రలకు సంబంధించిన బ్యాలన్స్ షూట్ పది రోజులు చేయాల్సి ఉందని శంకర్ ఇటీవల తెలియజేసారు. ప్రస్తుతం ఆ షూటింగ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతూనే వస్తున్నాయి. సినిమా రిలీజ్ కి ముందే మొత్తం సినిమా అంతా లీకులతో సోషల్ మీడియాలో చూపించేలా ఉన్నారు. ఆ మధ్య హెలికాఫ్టర్ సీన్, ఆ తరువాత చరణ్ కారు పై కూర్చొని వెళ్తున్న సీన్, ఇక తాజాగా ఎయిర్ పోర్ట్ సీన్. దాదాపు నిమిషం పాటు ఉన్న ఎయిర్ పోర్ట్ సీన్ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఆ సీన్ లో చరణ్ కూడా కనిపిస్తున్నారు. ఇవే కాదు, సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలా సీన్స్ లీక్ అవుతూనే వచ్చాయి. అయితే మూవీ టీం మాత్రం, దీని పై ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు.
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి, ఫైనల్ ఎడిట్ ఓకే అయినప్పుడే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ శంకర్ తెలియజేసారు. ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారట.