Ram Charan : చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంత ? దాంతో ఏం కొన్నాడో తెలుసా..?

చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అందుకున్నాడో..? దానితో ఏం కొన్నాడో తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Ram Charan First Remuneration and what he buys first with that remuneration

Ram Charan First Remuneration and what he buys first with that remuneration

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2007 లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ సినిమాతో పరిచయం అయిన చరణ్.. తండ్రి స్థాయిని అందుకుంటాడా అనే ప్రశ్నలు నుంచి తండ్రిని మించిన తనయుడు అనే ప్రశంసలు అందుకునే వరకు చేరుకున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీ దత్ నిర్మించిన చిరుత మూవీకి రామ్ చరణ్.. 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇక ఆ మొదటి సంపాదనతో ముందుగా తనకి నచ్చిన వస్తువు కొనుకున్నాడట.

రామ్ చరణ్ కి హ్యాండ్ వాచ్‌లు (Hand Watch) అంటే చాలా ఇష్టమంట. కొత్త మోడల్ ఏది వచ్చినా కొనుగోలు చేస్తుంటాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నట్లు కూడా వెల్లడించాడు. ఇక తన ఫస్ట్ రెమ్యూనరేషన్‌లో కొంతభాగంతో మొదట వాచ్ నే కొనుగోలు చేసినట్లు తెలియజేశాడు. అలాగే తన ఫేవరెట్ వాచ్ ఏంటనేది కూడా చెప్పుకొచ్చాడు. ప్రెజెంట్ అయితే తనకి పటెక్ (Patek Watch) ఇష్టమని వెల్లడించాడు. అయితే కోవిడ్ టైంలో కొన్న వాచ్ మాత్రం తన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నిటిలో బెస్ట్ వాచ్ అంటూ పేర్కొన్నాడు.

మిలిటరీ కలర్ తో ఉన్న కాసియో వాచ్ (CASIO) ని కరోనా సమయంలో రామ్ చరణ్ బుక్ చేశాడట. అది ఇంటికి వచ్చినప్పుడు తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. ఆ పార్సెల్ ని ఓపెన్ చేసి వాచ్ ని చూసిన సందర్భం తనకి ఇంకా కళ్ళ ముందే ఉందంటూ, ఆ వాచ్ తనకి అంతటి బెస్ట్ మూమెంట్ ని ఇచ్చిందని వెల్లడించాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో అమ్మాయిలకి గిఫ్ట్స్ ఇవ్వడం పై మాట్లాడుతూ.. “మగవాళ్ళు అమ్మాయిలకి ఏమి గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు. కాబట్టి వాళ్లకి ఏమి కావాలో అడిగి అది కొనివ్వండి. అంతేగాని వాళ్ళకి సర్‌ప్రైజ్ ఇవ్వాలని మీరు ప్రెజర్ తీసుకుంటే చివరికి మిగిలేది ఆ ప్రెజరే” అంటూ వ్యాఖ్యానించాడు.

 

Also Read : Ketika Sharma : కేతిక శర్మ స్టేట్ లెవెల్ ఛాంపియన్ అంట.. ఏ గేమ్‌లోనో తెలుసా? మరి సినిమాల్లోకి ఎలా?

 

  Last Updated: 23 Jul 2023, 09:04 PM IST