Ram Charan : రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాతో జనవరి 10న రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది.
రామ్ చరణ్ గతంలోనే ఒక డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేసాడు. 2013 లో అపూర్వ లోకియా దర్శకత్వంలో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా జంజీర్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సాంగ్స్ హిట్ అయినా సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా తెలుగులో తూఫాన్ పేరుతో రిలీజయింది. ఇక్కడ కూడా ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే అది 1973 లో అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ సినిమా జంజీర్ కి రీమేక్ గా తీశారు. చరణ్ జంజీర్ రిలీజయినపుడు అమితాబ్ సినిమాని చెడగొట్టారంటూ విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ బాలయ్య అన్‌స్టాపబుల్ షో కి వచ్చారు. ఇందులో బాలయ్య.. నీ జీవితంలో ఏ సినిమా విషయంలోనైనా ఎందుకు చేశాను అని బాధపడ్డావా అని అడిగారట. దానికి చరణ్ సమాధానమిస్తూ.. బాలీవుడ్ లో జంజీర్ సినిమా చేసాను. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అమితాబ్ గారి సూపర్ హిట్ జంజీర్ సినిమాకు రీమేక్ గా తీసాము. అయితే అంత మంచి సినిమాని మేము అనవసరంగా తీసి చెడగొట్టామేమో అని బాధపడ్డాను అంటూ తెలిపారు. దీంతో చరణ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.
Also Read : Rajasaab : జపాన్ లో ప్రభాస్ రాజాసాబ్ ఆడియో లాంచ్.. రాజాసాబ్ సీక్రెట్స్ రివీల్ చేసిన తమన్..