Site icon HashtagU Telugu

Ram Charan : ఈ నెలలో ఆ బహుమతి కోసం.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. చరణ్ ఇస్తాడా..?

Global Star Ram Charan

Ram Charan Fans Were Eagrly Waiting For Klin Kaara Birthday

Ram Charan : మెగా అభిమానులంతా ఈ నెలలో వచ్చి ఓ ముఖ్య రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇంతకీ ఆ రోజు ఏంటని ఆలోచిస్తున్నారా..? అది మరేంటో కాదు, మెగా వారి ముద్దుల వరుసరాలి పుట్టినరోజు. పెళ్లి అయిన పదకొండేళ్ల తరువాత రామ్ చరణ్, ఉపాసనకి జన్మించిన గారాలపట్టి ‘క్లీంకార’. ఇక ఈ మెగా వారసత్వం కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూసారు.

అయితే వారి ఎదురు చూపులు ఫలించాయి గాని, క్లీంకార దర్శనం మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. గత ఏడాది జూన్ 20న జన్మించిన క్లీంకార.. ఈ ఏడాదితో తన మొదటి పుట్టినరోజుని జరుపుకోబోతుంది. దీంతో ఈ నెల మొదలు కావడంతోనే చరణ్ అభిమానులు.. క్లీంకార మంత్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. క్లీంకార పుట్టినరోజుని కూడా గ్రాండ్ గా చేయాలని కొందరు అభిమానులు సిద్ధం అవుతున్నారు.

ఇది ఇలా ఉంటే, మొత్తం మెగా ఫ్యాన్స్ అంతా క్లీంకార దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ బర్త్ డే నాడు క్లీంకార ఫేస్ రివీల్ అయ్యిపోయింది. కానీ అఫీషియల్ దర్శనం మాత్రం జరగలేదు. దీంతో ఈ పుట్టినరోజున అయినా బహుమతిగా.. క్లీంకార పూర్తీ దర్శనం జరుగుతుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అభిమానులు ఎదురు చూస్తున్న బహుమతిని చరణ్ ఇస్తాడా లేదా..? అనేది చూడాలి.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమా పై చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.