Game Changer : రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ సందడి.. చరణ్ పప్పితో ఫ్యాన్స్ సెల్ఫీలు..

రాజమండ్రిలో 'గేమ్ ఛేంజర్' సందడి. షూటింగ్ చూసేందుకు వచ్చిన అభిమానులు.. చరణ్ పప్పితో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 9, 2024 / 04:23 PM IST

Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ్ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. గత మూడేళ్ళుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతుంది.

చరణ్ కి ఇదే చివరి షెడ్యూల్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చరణ్ పై సన్నివేశాలను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఓపెన్ సెట్ షూటింగ్ అవ్వడంతో ఆడియన్స్.. షూటింగ్ సెట్స్ కి చేరుకొని సందడి చేస్తున్నారు. ఇక ఆ షూటింగ్ కి సంబంధించిన వర్క్స్ ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్ తో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.

అభిమానులు చరణ్‌ని.. పిఠాపురం గారి అబ్బాయి అని పిలవడం, చరణ్ అభిమానులకు అభివాదం చేయడం ఇలా కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీటిలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదే రామ్ చరణ్ పెట్ డాగ్ ‘రైమ్’కి సంబంధించిన వీడియో. రామ్ చరణ్ కి ఉన్న పప్పి గురించి అందరికి తెలిసిందే. చరణ్ తో పాటు ఈ పప్పి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దీంతో షూటింగ్ సెట్స్ రైమ్ కనిపించడంతో.. దానిని ఎత్తుకొని కొందరు అభిమానులు సెల్ఫీలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి ఆ వీడియోలు వైపు మీరు ఓ లుక్ వేసేయండి.