Site icon HashtagU Telugu

Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాదా? ఆ పోస్టర్ తో అభిమానులు నిరాశ..

Ram Charan Fans Disappointed with Game Changer New Poster is it Not a Pan Indian Movie

Ram Charan Fans Disappointed with Game Changer New Poster is it Not a Pan Indian Movie

రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఈ సినిమాని ప్రకటించినా ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు. పలు కారణాలతో గేమ్ ఛేంజర్ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూట్ జరుపుకుంటుంది. ఇటీవలే వైజాగ్ లో షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ అయ్యాక మళ్ళీ ఏప్రిల్ లో షూటింగ్ జరగనుంది.

ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి..’ అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఈ సాంగ్ కి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా ఉండగా రామ్ చరణ్ కూడా అదిరిపోయే పోజుతో మెరిసిపోతూ ఉన్నాడు. అయితే ఈ పోస్టర్ పై జరగండి అనే టైటిల్ ఇచ్చి దాని కింద చిన్నగా కేవలం తెలుగు – తమిళ్ – హిందీ అని ఉంది.

దీంతో ఈ పాటని కేవలం ఆ మూడు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారా? లేక గేమ్ ఛేంజర్ సినిమా కూడా కేవలం ఆ మూడు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారా? కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయట్లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. RRR సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా వైడ్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా ముందు నుంచి పాన్ ఇండియా అని చెప్తున్నారు. ఇప్పుడేమో కేవలం మూడు భాషలనే రాశారు. దీంతో అభిమానులు చిత్రయూనిట్ ని ప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉందా? లేదా? ఈ పాట ఒకటే మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారా? మిగిలిన రెండు భాషల్లో ఎందుకు రిలీజ్ చెయ్యట్లేదు అని చరణ్ అభిమానులు అడుగుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ మాట్లాడాల్సిందే.

 

Also Read : Prithviraj Sukumaran : ఒక్క సినిమా కోసం 16 ఏళ్ళ ప్రయాణం.. ఎడారిలో కష్టాలు.. ది గోట్ లైఫ్ సినిమా కోసం పృథ్విరాజ్..