Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారని తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ప్రమోషన్స్ లో మరింత యాక్టివ్ గా పాల్గొంటున్నాడు తమన్. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండో పాట విడుదల అయింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఓ కాలేజీలో నిర్వహించగా దిల్ రాజు, శంకర్, తమన్, శ్రీకాంత్, SJ సూర్య హాజరయ్యారు.
తాజాగా ఓ రామ్ చరణ్ ఫ్యాన్ తమన్ కి రిక్వెస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసాడు. గేమ్ ఛేంజర్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో తమన్ వీడియోని పోస్ట్ చేస్తూ.. అన్న హాఫ్ షర్ట్ బాగుంది, గిఫ్ట్ చెయ్ అని ట్వీట్ చేసాడు. దీంతో తమన్ ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. నువ్వు చేసిన డ్యూటీ చూసాను బ్రదర్, నీ అడ్రెస్, నీ సైజ్ మెసేజ్ పెట్టు కొని పంపిస్తాను, నేను వేసుకున్నది నీకు పెద్దది అవ్వొచ్చు అని తెలిపాడు తమన్.
తమన్ వేసుకున్న లాంటి షర్ట్ అడగ్గానే పంపిస్తాను అనడంతో ఆ చరణ్ ఫ్యాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మరికొంతమంది నెటిజన్లు కూడా ఏదో ఒకటి కావాలని అడుగుతూ ట్వీట్స్ వేయడం మొదలుపెట్టారు.
Nuvvvu chesiiina duty choooossaa bro @AlwaysAkashRC 🚁🚁
DM me ur address bro
Ur size also konnii pampissta ❤️
This may be bigggg for You 🫶 https://t.co/fGDvM7tnCY— thaman S (@MusicThaman) October 1, 2024
Also Read : Pooja Hegde : విజయ్ లాస్ట్ సినిమా ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. అధికారికంగా అనౌన్స్..