Site icon HashtagU Telugu

Ram Charan : కూతురితో కలిసి ఏనుగు రెస్క్యూ క్యాంపులో.. ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..

Ram Charan Enjoying Vacation With Klin Kaara At Thailand Elephant Rescue Camp

Ram Charan Enjoying Vacation With Klin Kaara At Thailand Elephant Rescue Camp

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఉపాసన, కూతురు క్లీంకార, పెట్ డాగ్ రైమ్ తో కలిసి బ్యాంకాక్ కి వెళ్లి అక్కడ వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేసి నిన్ననే తిరిగి వచ్చారు. ఇక అక్కడ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఉపాసన.. తమ పెట్ డాగ్ రైమ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి షేర్ చేస్తూ అభిమానులతో తమ హ్యాపీ మూమెంట్స్ ని పంచుకుంటూ వచ్చారు.

ఇక తాజాగా మరొకొన్ని పిక్స్ ని కూడా షేర్ చేసారు. ఈ పిక్స్ లో ఒక పిక్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఆ పిక్ లో రామ్ చరణ్ ఒక చిన్న ఏనుగు పిల్లకి స్నానం చేయిస్తూ కనిపిస్తున్నారు. థాయిలాండ్ లోని ‘కో సముయ్’ ఐలాండ్ లో ఉన్న ఏనుగు రెస్క్యూ క్యాంపుని రామ్ చరణ్ ఫ్యామిలీ సందర్శించారు. ఇక అక్కడ ఏనుగులు మధ్య కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్ వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస షెడ్యూల్స్ తరువాత షూటింగ్ కి కొంచెం గ్యాప్ రావడం రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి ఈ వెకేషన్ వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న

ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని దీవాళీ కానుకగా అక్టోబర్ లో తీసుకు వచ్చేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ డేట్ ని అఫీషియల్ అనౌన్స్ చేయబోతున్నారు.

Also read : Ram Charan : టిల్లు గాడిని చూస్తే చాలా గర్వంగా ఉందంటున్న రామ్ చరణ్.. పోస్ట్ వైరల్