Site icon HashtagU Telugu

Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!

Jr Ntr Ram Charan

Jr Ntr Ram Charan

ఎన్టీఆర్, రాంచరణ్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అంటే చరణ్ కు ఎంతో ఇష్టం. చరణతో స్నేహం గురించి ఎన్నో సందర్భాల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్. మన స్నేహానికి ఎవరి దిష్టి తగలకూడదు అన్నాడు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బ్రదర్, కో స్టార్, ఫ్రెండ్…నువ్వు నాకెంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు. మన దగ్గర ఉన్నవాటిని నేనెప్పుడు ఆనందంగా ఫీల్ అవుతానంటూ..రాంచరణ్ ఓ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ ను హత్తుకున్న ఫొటోను షేర్ చేశాడు చరణ్. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

రాంచరణ్ పెట్టిన ట్వీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ చరణ్ అన్న …జై ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. RRRమూవీ టీం మా భీంకు బర్త్ డే విషేస్ అంటూ పోస్టు చేసింది.

Jr NTR 

ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు కొన్ని గంటల ముందే తారత్ బర్త్ డే ట్రీట్ ను అందించాడు. #NTR30మూవీకి సంబంధించిన ఒక డైలాగ్ రిలీజ్ చేశారు. ఈ మూవీ పవర్ ఫుల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్నట్లు ఈ స్పెషల్ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియో తారక్ చెప్పే డైలాగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. మాస్ బేస్ వాయిస్ తో తారక్..అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు…అవసరానికి మించి దమ్ము ఉండకూడదని అని ఆ టైంలో భయానికి తెలియాలి…తాను రావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ గూస్ బంప్స్ తెప్పించే ఎన్టీఆర్ డైలాగ్స్ అదిరిపోయాయి.