Site icon HashtagU Telugu

Klinkara : ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకార కెమెరా కు చిక్కింది

Ram Charan Daughter Klinkar

Ram Charan Daughter Klinkar

మెగా ప్రిన్సెస్ క్లీంకార (Klinkara)..ఎలా ఉంటుందో..ఒక్కసారైనా చూపిస్తే బాగుండు అని మెగా అభిమానులు (Mega Fans) ఆమె పుట్టిన దగ్గరి నుండి ఎదురుచూస్తున్నారు. చరణ్ (Ram CHaran) కానీ , ఉపాసన (Upasana) కానీ ఇలా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మెగా ప్రిన్సెస్ పేస్ ను కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. కానీ ఈరోజు తిరుమల వెంకన్న సాక్షిగా మెగా క్లీంకార క్లిక్ అనిపించింది.

ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan Birthday) సందర్బంగా కుటుంబ సమేతంగా ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చరణ్ దంపతులకు ఆలయ అధికారులు , అర్చకులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో గుడిలోకి వెళ్తున్న సమయంలో క్లీంకార ఫేస్ కెమెరా కు చిక్కింది. ఇక క్లీంకార ఫేస్ చూసిన అభిమానులు.. ఎంత క్యూట్ గా ఉందంటూ సోషల్ మీడియాలోనే తెగ ముద్దాడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భాంగా సోషల్ మీడియా అంతా చరణ్ నామసరణ తో మోగిపోతుంది. ఒక పక్క మూవీ అప్డేట్స్, మరో పక్క ఫ్యాన్స్ స్పెషల్ పోస్టులతో టైంలైన్ అంతా మెగా పవర్ మ్యానియా కనిపిస్తుంది. ఇదే సందర్భాల్లో చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుండి ‘జరగండి’ సాంగ్ ను రిలీజ్ చేసి అభిమానులను మరింత ఉత్సహంలో నింపారు. శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటిసారి రాజకీయన నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ పాత్రలోనూ నటిస్తున్నారు.

Read Also : Kejriwal Vs ED : కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం.. మూడువారాల టైం కోరిన ఈడీ