Site icon HashtagU Telugu

Game Changer: రామ్ చరణ్ క్రేజ్.. గేమ్ ఛేంజర్ మూవీకి ‘జీ స్టూడియోస్’ 350 కోట్లు ఆఫర్!

Game Changer

Ram Charan Game Changer Movie Climax Fight Planning with 1200 Fighters

రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ గా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ  మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రముఖ జీ స్టూడియోస్ రూ. 350 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. “పాన్-ఇండియా చిత్రంగా కూడా రూపొందించబడిన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఇది రికార్డ్ ధర.

“RRR’ వంటి తెలుగు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసినప్పటి నుండి భారీ కాంబినేషన్‌తో కూడిన తెలుగు సినిమాలు కార్పొరేట్ సంస్థలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. అన్నింటికీ మించి రామ్ చరణ్ అంతర్జాతీయంగా పాపులారిటీ సంపాదించాడు’’ అని సినిమి క్రిటిక్స్ చెబుతున్నారు.  నిజానికి ‘ఎఫ్ 2’, ‘మహర్షి’, ‘ఫిదా’, ‘దువ్వాడ జగన్నాథం’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు నిర్మాత దిల్ రాజు తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్, రష్మికలతో కలిసి రూ.200 కోట్లతో ‘వరిసు’ చిత్రాన్ని రూపొందించి విజయాన్ని రుచి చూశాడు.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ ‘గేమ్ ఛేంజర్’ కోసం తెలుగులోకి వచ్చాడు. “ఇప్పటికే, రామ్ చరణ్ మరియు శంకర్ చేతులు కలపడం తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి టాలీవుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఒకవైపు స్టార్ డైరెక్టర్, మరోవైపు స్టార్ హీరో కాంబినేషన్ ఈ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: 38 Girls Sick: మలేరియా నివారణ మాత్రలు మింగి 38 మంది విద్యార్థినులకు అస్వస్థత