Site icon HashtagU Telugu

HIT 3 : నానికి ప్రత్యేక అభినందనలు తెలిపిన రామ్ చరణ్

Charan Nani

Charan Nani

న్యాచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘హిట్ 3’ (HIT3)చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. శైలేష్ కొలనుని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను , విమర్శకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాని సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో చక్కటి నటనను ప్రదర్శించాడు. గతంలో వచ్చిన ‘హిట్’ ఫ్రాంఛైజీ సినిమాలకు కొనసాగింపుగా రూపొందిన ఈ మూడో భాగం ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ పై పలువురు సినీ ప్రముఖులు తమ స్పందనను తెలుపగా..తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ఈ సినిమాపై తన స్పందనను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.

Tip : పురాతన కాలం నాటి చిట్కా ఫాలో అయితే మీకు ఆ దిగులు ఉండదు

“హిట్ 3 గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నాను. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అన్ని జోనర్‌లలో విజయాలు సాధిస్తున్న నాసోదరుడు నానికి ప్రత్యేక అభినందనలు. ఈ ఇంటెన్స్ సినిమాకు కథను రాసి, బలంగా తెరపై చూపించిన దర్శకుడు శైలేష్ కొలనుకి శుభాకాంక్షలు. అలాగే నటి శ్రీనిధి శెట్టి మరియు చిత్రబృందానికి కూడా అభినందనలు” అని చరణ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ నాని అభిమానులను ఎంతో ఉత్సాహానికి గురిచేసింది.

మే 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం నైజాంలో రూ.8 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.9 కోట్లు వసూలు చేసింది. అలాగే కర్ణాటకలో రూ.3 కోట్లు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లు సాధించింది. మొత్తంగా ఇండియాలో ఇప్పటివరకు రూ.45 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, శైలేష్ కొలను క్రైమ్ యూనివర్స్‌కి మరో గొప్ప విజయం అందించింది.