Site icon HashtagU Telugu

Ram Charan : ఆర్‌సీ 16 సెట్స్‌లోకి స్పెషల్‌ గెస్ట్‌.. రామ్‌ పోస్ట్‌ వైరల్‌

Klin Kaara, Ram Charan

Klin Kaara, Ram Charan

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ‘RC 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాది చివర్లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మైసూర్‌లో చిన్న షెడ్యూల్ పూర్తయింది, , తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు.

ఈ చిత్ర షూటింగ్‌లో బుధవారం (ఫిబ్రవరి 5) సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ సందడి చేసింది. ఆ గెస్ట్ మరెవరో కాదు, రామ్ చరణ్ కూతురు క్లింకార . ఆమె RC 16 మూవీ సెట్లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన కుమార్తె క్లింకార తో దిగిన ఓ ఫొటోని షేర్ చేస్తూ, ”సెట్‌లో నా లిటిల్ గెస్ట్” అని రామ్ చరణ్ పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలో క్లింకార ఒక వస్తువును చూపిస్తూ ఉండగా, రామ్ చరణ్ నవ్వుతూ తన కూతురిని చూస్తున్నారు. ఈ ఫోటోని చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇటీవల ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న రామ్ చరణ్, తన కుమార్తె ముఖాన్ని ప్రజలకు చూపించకుండా, ‘నాన్న’ అని పిలిచే వరకు క్లింకార ముఖం దాచినట్లు చెప్పారు. ఇప్పుడు ఆమె ముఖం కనిపించకుండా పక్కన ఉన్న ఫోటోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోకు భారీ స్పందన వచ్చింది. మెగా అభిమానులు, “గ్లోబల్ స్టార్ తో కలిసి చిన్న ప్రిన్సెస్ ఎంతో క్యూట్‌గా ఉంది” అని కామెంట్ చేస్తున్నారు.

Delhi Exit Poll Results 2025 : ఎగ్జిట్ పోల్స్ పై ‘ఆప్’ అసంతృప్తి

రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉండరు. కానీ ఈ ప్రత్యేక సందర్భాన్ని అభిమానులతో పంచుకోవడానికి తన ఇన్స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ తన కుమార్తె ఫోటోని మరింత వివరంగా చూడాలని కోరుకుంటున్నారు.

ఈ ఫోటోలో ‘RC 16’ సెట్లో జాతర ఎపిసోడ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ గతంలో శంకర్ దర్శకత్వంలో నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అందుకే ఈసారి ‘RC 16’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Leprosy : కుష్టు వ్యాధి ఎలా వ్యాపిస్తుందో మీకు తెలుసా?