Shankar : దర్శకుడు శంకర్ కూతురి రిసెప్షన్‌లో.. చరణ్, చిరుతో పాటు జాన్వీ కపూర్

దర్శకుడు శంకర్ కూతురి రిసెప్షన్‌లో చరణ్, చిరుతో పాటు జాన్వీ కపూర్ ఫోటోలు చూసారా..?

Published By: HashtagU Telugu Desk
Ram Charan Chiranjeevi Janhvi Kapoor At Shankar Daughter Aishwarya Marriage Reception

Ram Charan Chiranjeevi Janhvi Kapoor At Shankar Daughter Aishwarya Marriage Reception

Shankar : గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ తన పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్‌‌ని.. తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ కి ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేసారు. ఐశ్వర్యకి ఇది రెండో వివాహం. కరోనా సమయంలో రోహిత్ అనే ఓ క్రికెటర్‌తో ఐశ్వర్య పెళ్లిని శంకర్ ఘనంగా నిర్వహించారు. అయితే ఆ తరువాత రోహిత్ పై పోక్సో కేసు నమోదు అయ్యి వివాదాల్లో చిక్కోవడంతో.. ఆ పెళ్లిని కొన్ని నెలలకే రద్దు చేసుకున్నారు.

ఆ తరువాత ఐశ్వర్య తన తండ్రి దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్ తో ప్రేమలో పడింది. దీంతో శంకర్ వారి ప్రేమని అంగీకరించి.. మొదటి పెళ్లి లాగానే, ఈ పెళ్లిని కూడా గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ ని ఘనంగా సెలబ్రేట్ చేసిన శంకర్.. నిన్న ఏప్రిల్ 15న పెళ్లిని మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఈ పెళ్ళికి సినీ, రాజకీయ రంగం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు.

నిన్న జరిగిన వివాహానికి తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ, నయనతార దంపతులు, మణిరత్నం, సుహాసిని పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక నిన్న ఈవెనింగ్ జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో మెగా హీరోలు సందడి చేసారు. చిరంజీవి, రామ్ చరణ్ సతీసమేతంగా రిసెప్షన్ కి హాజరయ్యారు. అలాగే అల్లు అరవింద్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి తదితరులు హాజరయ్యి ఐశ్వర్య-తరుణ్ ని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Apoorva Srinivasan : ఏడడుగులు వేసేసిన తెలుగు నటి.. ముద్దు ఫొటోలతో..

  Last Updated: 16 Apr 2024, 01:16 PM IST