Ram Charan Cars : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRRతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాన్ ఇండియా పలకరించనున్నాడు. ఈ సినిమా ఇంకో పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలను కూడా లైన్లో పెట్టి బిజీగానే ఉన్నాడు చరణ్.
అయితే మెగా ఫ్యామిలీకి ఆస్తులు చాలా ఉన్నాయని తెలిసిందే. ముఖ్యంగా కార్లు కూడా చాలా ఉన్నాయి. చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ తో పాటు మరో నాలుగు కార్లు ఉన్నాయి. రామ్ చరణ్ కి కూడా దాదాపు 6 ఖరీదైన కార్లు ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కొత్త వర్షన్ స్పెక్ట్రా కొనుక్కున్నాడు. దాదాపు 7.5 కోట్లతో చరణ్ ఈ కారుని కొన్నాడు. జనవరిలో ఈ కార్ విడుదలవ్వగా చరణ్ అప్పుడే బుక్ చేసాడు. ఆ కార్ ఇటీవలే చరణ్ చేతికి వచ్చింది. హైదరాబాద్ లో ఈ కార్ కొన్న మొదటి వ్యక్తి చరణ్ కావడం గమనార్హం.
రామ్ చరణ్ దాదాపు 7.5 కోట్లు ఖర్చుపెట్టి కొత్త కారు కొనడంతో మరోసారి చరణ్ కార్లు చర్చగా మారాయి. చరణ్ కి ఇప్పుడు కొన్న రోల్స్ రాయిస్ కారుతో పాటు ఇంకో అరడజను కార్లు ఉన్నాయి. 4 కోట్ల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLS 600 కారు, కోటి రూపాయల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ GLE400 కూప్ కారు, 3.2 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ వన్టేజ్ కారు, 3.5 కోట్ల విలువ చేసే ఫెరారీ పోర్టోఫినో కారు, 2.75 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారు, 1.75 కోట్లు విలువ చేసే BMW 7 సిరీస్ కారు ఉన్నాయి. చరణ్ దగ్గర ఇంత ఖరీదైన కార్లు ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం చరణ్ కొత్త రోల్స్ రాయిస్ కారులో ఎయిర్ పోర్ట్ కి వెళ్లడంతో వీడియోలు వైరల్ గా మారాయి.
(RRR) Rolls-Royce-RamCharan 🔥🔥🔥
Mini size movie chupinchav kada entanna aa presence aa charm!! @AlwaysRamCharan#RamCharan #GameChanger pic.twitter.com/VtV1hfYQON— ₵₳₱₮₳ł₦ ł₦Đł₳™ 🚁🚁 (@Captain_India_R) July 11, 2024
Also Read : Kalyan Dilip Sunkara : రాజ్ తరుణ్ కేసు.. లావణ్య కోసం రంగంలోకి దిగిన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర..