Ram Charan-Upasana: స్టార్ హీరో అయినా.. భార్య బ్యాగులు మోయాల్సిందే!

రామ్ చరణ్ (Ram charan) గ్లోబర్ స్టార్ అయినప్పటికీ ఓ భర్తగా మాత్రం సామాన్యుడిలానే ఉంటాడు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Ram Charan

టాలీవుడ్ (Tollywood) బెస్ట్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), ఉపాసన (Upasana) కామినేని జంట ఒకటి. వీరిద్దరు తమ తమ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమదైన అభిరుచులను పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లలో మెరుస్తూ బెస్ట్ కపుల్ అని అనిపించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి బేధాబ్రిపాయాలకు తేడా లేకుండా అన్యోన్యంగా జీవిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ (Ram charan) గ్లోబర్ స్టార్ అయినప్పటికీ ఓ భర్తగా మాత్రం సామాన్యుడిలానే ఉంటాడు.

ఉపాసన గర్భవతి అయినప్పట్నుంచీ మరింత సమయాన్ని ఆమెతో గడుపుతున్నాడు. షాపింగ్, లాంగ్ డ్రైవ్, టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లోకి తమ బేబీమూన్ వీడియోను షేర్ చేసింది. వీడియోలో రామ్ చరణ్ (Ram charan) ఉపాసన షాపింగ్ బ్యాగ్‌లను మోయడం చూడొచ్చు. ఈ జంట ఎప్పటిలాగే స్టైలిష్ వేషధారణలో పర్ఫెక్ట్ గా కనిపించారు. ఉపాసన పచ్చని స్కర్ట్‌తో మ్యాచింగ్ టాప్‌తో జతచేయగా, చరణ్ పూర్తిగా నలుపు రంగులో ఉండే క్యాజువల్ దుస్తులను ధరించాడు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన భర్త రామ్ చరణ్ పై ఉపాసన తన ప్రేమను చాటుకుంది. ‘‘నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో రామ్ చరణ్ నాకు మద్దతుగా నిలిచారు. అలాగే నేను చెర్రీకి అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటాను. నాటు నాటు (Natu Natu) సాంగ్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లినప్పుడైనా.. ఇంట్లో ఉన్నా.. అలాగే షూటింగ్ అంటూ బిజీగా గడుపుతున్నప్పుడైనా ఇలా ప్రతి విషయంలోనూ నేను చెర్రీకి వెన్నంటే ఉన్నా. ఎలాంటి సందర్భంలోనైనా తనకు నేను శాయశక్తుల సాయం చేస్తుంటాను. ఇక చెర్రీకి ఈ ఏడాది చాలా ఆనందాన్ని ఇచ్చింది. తన వర్క్ పరంగా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. ఈ సంవత్సరం చరణ్ ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. ఈ ఏడాది తనదే ” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Hamsa Nandini: క్యాన్సర్ తో పోరాడిన హంసా నందిని.. వ్యాధిని జయించిందిలా!

  Last Updated: 08 Mar 2023, 12:50 PM IST