మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) గ్యారెంజ్ లోకి మరో లగ్జరీ కారు వచ్చి చేరింది..లగ్జరీ కారు అంటే ఆషామాషీ కారు కాదు. రోల్స్ రాయిస్ కంపెనీ కారు దీని ధర తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు. రామ్ చరణ్ కు మొదటి నుండి లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం..మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన అది తన గ్యారెంజ్ లో ఉండాల్సిందే. మార్కెట్ లోకి ఎప్పుడెప్పుడు ఏ కొత్త కారు వస్తుందా..అని ఎదురుచూస్తుంటారు. తాజాగా మార్కెట్లోకి ‘రోల్స్ రాయిస్ స్పెక్ట్రా’ (Rolls-Royce Spectre) రావడం తో దానిపై మనసు పారేసుకున్నాడు. అంతే వెంటనే దానిని కొనుగోలు చేశారు. ఈ కారు ధర అక్షరాల ఏడున్నర కోట్లు.. ఇక ఆన్ రోడ్ ప్రైస్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారు ఇండియాలో రెండోది కాగా, హైదరాబాద్ (Hyderabad)లో ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం విశేషం. బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి గాను చరణ్ దంపతులు ముంబై చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ఈ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో చరణ్ , ఉపాసన కనిపించారు. చరణ్ స్వయంగా ఈ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ స్పెక్ట్రా మోడల్ ప్రత్యేకతలు (Rolls-Royce Spectre Features) చూస్తే..
ఇది ఎలక్ట్రిక్ కారు..పూర్తిగా అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్‌తో రూపొందుకుంది. స్ప్లిట్ హెడ్ ల్యాంప్.. హెడ్‌లైట్స్ పైన ఆల్ట్రా స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను ఇందులో అమర్చారు. అలాగే 22 ఎల్ఈడీ బల్పులతో పాంథియన్ గ్రిల్‌ను రూపొందించారు. చీకటిలో ఇది అదిరిపోతుందని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. 23 అంగుళాల వీల్స్‌ను ఈ కారుకు అమర్చారు. 575 బీహెచ్‌పీ పవర్ ఇంజిన్‌తో 900 ఎన్ఎం టార్క్‌ను స్పెక్ట్రా రిలీజ్ చేస్తుంది. కేవలం 4.4 సెకన్లలోనే అలవోకగా 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుందట. ఈ కారులో 102 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జ్‌తో ఏకంగా 521 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చట. ఇన్ని ప్రత్యేకతలు ఉంటె చరణ్ కొనకుండా ఉంటారా చెప్పండి.
ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుకుంటుంది. రీసెంట్ గా తన పాత్ర తాలూకా షూటింగ్ మొత్తాన్ని చరణ్ పూర్తి చేసాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.
Read Also : NEET : నీట్ పేపర్ లీక్ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!