RC 16 : వరల్డ్ వైడ్ ట్రీట్.. రామ్ చరణ్ రచ్చ కన్ఫర్మ్..!

RC 16 ఉప్పెనతో మొదటి సినిమానే బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా డైరెక్టర్ బుచ్చిబాబు తన రెండో అటెంప్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Ram Charan

Ram Charan

RC 16 ఉప్పెనతో మొదటి సినిమానే బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా డైరెక్టర్ బుచ్చిబాబు తన రెండో అటెంప్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రాం చరణ్ తన ప్రతి సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమా కేవలం ఫ్యాన్ ఇండియా నే కాదు పాన్ వరల్డ్ లో ఉండబోతుందట. అందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్సి 16 వరల్డ్ వైడ్ అని పెట్టి ఫైర్ సింబల్ యాడ్ చేశారు. సో ఈ సినిమా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఆపిల్ ఉండబోతుందని తెలుస్తుంది. ఎలాగూ త్రిబుల్ ఆర్ తో రామ్ చరణ్ కి గ్లోబల్ వైస్ క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నారు.

రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు టెక్నీషియన్స్ కూడా భారీ స్థాయిలో ఉంటారని తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ ని ఫిక్స్ చేశారని టాక్. ఆల్రెడీ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని తెలిసిందే. మొత్తానికి ఆర్ సి 16 భారీ అంచనాలతో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుంది. చరణ్ గేమ్ చేంజర్ పూర్తి కావడమే ఆలస్యం బుచ్చిబాబు సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నాడు.

  Last Updated: 15 Feb 2024, 10:22 PM IST