Site icon HashtagU Telugu

Krithi Shetty Sri Leela : బేబమ్మ కాదు బుజ్జమ్మకే ఆ ఛాన్స్..!

Ram Charan Bucchi Babu Movie Chance Not Krithi Shetty Its Sri Leela

Ram Charan Bucchi Babu Movie Chance Not Krithi Shetty Its Sri Leela

Krithi Shetty Sri Leela ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఆ తర్వాత రెండు సినిమాలు కూడా పర్వాలేదు అనిపించుకోగా ఆ తర్వాత అసలు సినిమా అర్ధమైంది. వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ ని రిస్క్ లో పడేయగా ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి కూడా డైరెక్టర్స్ వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం కృతి శెట్టి శర్వానంద్ తో మనమే సినిమా చేస్తుంది. శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బేబమ్మ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. ఇదిలాఉంటే చరణ్ తో బుచ్చి బాబు చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా కృతి శెట్టి ఉంటుందని వార్తలు వచ్చాయి. చరణ్ 16వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారు. అయితే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుందని టాక్ వచ్చింది. బుచ్చి బాబు తన ఉప్పెన సెంటిమెంట్ తో కృతిని తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. కానీ లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ప్రకారం ఆ ఛాన్స్ కృతి శెట్టి నుంచి శ్రీ లీల అందుకుందని తెలుస్తుంది. గుంటూరు కారం తర్వాత శ్రీలా మరో సినిమా సైన్ చేయలేదు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా కూడా అది ఎప్పుడు మళ్లీ మొదలవుతుందో తెలియదు. అందుకే ఈ గ్యాప్ లో సినిమాలు చేయాలని చూస్తున్న శ్రీలీలకు చరణ్ సినిమా ఆఫర్ వచ్చిందట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి సెకండ్ హీరోయిన్ అయినా కూడా ఓకే అనేసిందట. ప్రస్తుతం రాం చరణ్ గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి చేసి బుచ్చి బాబు సినిమాకు పూర్తి టైం కేటాయించనున్నాడు.

Also Read : Karthikeya Bhaje Vayu Vegam : మహేష్ వదిలిన బాణం.. భజే వాయు వేగం..!