Ram Charan: షూటింగ్స్ కు రామ్ చరణ్ బ్రేక్..? పుట్టబోయే బిడ్డ కోసమేనా!

ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడని సమాచారం.

Published By: HashtagU Telugu Desk

తాజాగా రామ్ చరణ్ (Ram Charan) గురించి ఓ వార్త టాలీవుడ్ (Tollywood) లో వైరల్ అవుతుంది. త్వరలో చరణ్ – శంకర్ సినిమా గేమ్ ఛేంజర్ షూట్ ఉండబోతుంది. ఆ షెడ్యూల్ అయిన తర్వాత ఉపాసన డెలివరీ అయ్యేవరకు చరణ్ షూటింగ్స్ కు బ్రేక్ ఇస్తాడని సమాచారం. మొదటిసారి ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో, డెలివరీ టైంలో ఉపాసన (Upasana) దగ్గరే ఉండాలని, ఉపాసనకు టైం ఇవ్వాలని చరణ్ భావిస్తున్నాడని, అందుకే ప్రస్తుతం ఓకే చేసిన షూటింగ్ షెడ్యూల్ ని పూర్తి చేసి ఉపాసన డెలివరీ అయ్యేవరకు తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇస్తాడని అంటున్నారు.

ఉపాసన డెలివరీ అయ్యాకే మళ్ళీ చరణ్ షూటింగ్స్ లో పాల్గొంటాడని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా మెగా సన్నిహితుల్లో ఈ టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ (Tollywood) బెస్ట్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan), ఉపాసన (Upasana) కామినేని జంట ఒకటి. వీరిద్దరు తమ తమ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమదైన అభిరుచులను పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లలో మెరుస్తూ బెస్ట్ కపుల్ అని అనిపించుకుంటున్నారు.

ఎలాంటి బేధాబ్రిపాయాలకు ఫోకుండా అన్యోన్యంగా జీవిస్తు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే రామ్ చరణ్ (Ram charan) గ్లోబర్ స్టార్ అయినప్పటికీ ఓ భర్తగా మాత్రం సామాన్యుడిలానే ఉంటాడు. ఉపాసన గర్భవతి అయినప్పట్నుంచీ మరింత సమయాన్ని ఆమెతో గడుపుతున్నాడు. షాపింగ్, లాంగ్ డ్రైవ్, టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లైన దాదాపు పదేళ్లకు ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుండటం మెగా ఫ్యామిలీలో ఆనందం నెలకొంది.

Also Read: Telangana Elections: బీజేపీ బిగ్ స్కెచ్.. జూన్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు!

  Last Updated: 20 Apr 2023, 01:05 PM IST