Ram Charan as James Bond?: ‘మెగాహీరో’కు హాలీవుడ్ ఆఫర్.. ‘జేమ్స్ బాండ్‌’గా రామ్ చరణ్!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో మెగా హీరో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Ramcharan

Ramcharan

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీలో మెగా హీరో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. రాంచరణ్ నటకుగాను ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. అంతేకాదు. హాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు చరణ్ నటనను మెచ్చుకున్నారు. పీరియడ్ ఫిల్మ్‌లో స్వాతంత్ర్య సమరయోధుడి గా మెప్పించిన చరణ్ జేమ్స్ బాండ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. 2021 చిత్రం నో టైమ్ టు డైలో నటించిన తర్వాత డేనియల్ క్రెయిగ్ అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త, రామ్ చరణ్ బెస్ట్ ఛాయిస్ అని భావిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

‘జేమ్స్ బాండ్ పాత్రలో ఏ హీరో అయితే బాగుంటుంది’ అని తెలుసుకోవడం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడె, డామ్సన్ ఇద్రిస్ లాంటి నటుల్ని కొంతమంది సజెస్ట్ చేయగా, చాలామంది నెటిజన్స్ మాత్రం రామ్ చరణ్ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. సరైన హీరో కావాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ నటనను చూడండి అంటూ  రీట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త రామ్ చరణ్ జేమ్స్ బాండ్ పాత్రను పోషించాలని భావిస్తున్నాడు. రామ్ చరణ్ అభిమానులు ‘కింగ్ ఆఫ్ టాలీవుడ్’ అని మెగా హీరోను పొగిడేస్తున్నారు. ఈ న్యూస్ నిజమైతే ఇక రాంచరణ్ త్వరలో హాలీవుడ్ కలను నెరవేర్చుకోగలడు. ఇక పాన్ ఇండియా హీరోగా కాకుండా, ఇంటర్నేషన్ హీరోగా రాంచరణ్ మారే అవకాశాలున్నాయి.

  Last Updated: 28 Jul 2022, 04:09 PM IST