Site icon HashtagU Telugu

Ramcharan: ఆధ్యాత్మిక సేవలో మెగాపవర్ స్టార్

Ramcharan

Ramcharan

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ ఆర్ఆర్ఆర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. దాంతో రాంచరణ్ ఫ్యాన్స్ ఆయనకు నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేశారు. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ తన యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తో పోటీగా నటించాడు. దీంతో చరణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. చరణ్ లో ఇంత గొప్ప నటుడిని చూసి…బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది.

అయితే రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నారు. స్వామియే శరమయ్య అంటూ అయ్యప్ప సేవలో మునిగిపోయారు చరణ్. ముంబై ప్రైవేట్ ఎయిర్ పోర్టులో చరణ్ అయ్యప్ప దుస్తుల్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. కాళ్లకు చెప్పులు లేకుండా నేలపై నడిచాడు. ఈ ఏడాదితో చరణ్ గురుస్వామి అయినట్లు తెలుస్తోంది. భుజాన గురుస్వామి కండువా ధరంచిన చరణ్…ప్రతి ఏడాది అయ్యప్ప మాటల ధరిస్తుంటారు.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను అందుకున్న రాంచరణ్…శంకర్ దర్శకత్వంలో ఆర్ సి 15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ అమృత్‌సర్ యూనివర్సిటీలో ప్రారంభించినట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య ఏప్రిల్ 29న థియేటర్లలోకి రానుంది.