See Pics: అయ్యప్ప మాలలో ‘ఆర్ఆర్ఆర్’ నటుడు!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Charan

Charan

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు సాధిస్తోంది. ఆర్ఆర్ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్న మెగా హీరో రాంచరణ్ ముంబైలో గైటీ థియేటర్ వద్ద సందడి చేశాడు. దీంతో చరణ్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు చరణ్ ను చుట్టుముట్టి ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాంచరణ్ పూర్తిగా నలుపు రంగు కుర్తా, పైజామా ధరించి, కాటన్ టవల్ భుజానా వేసుకొని ప్రత్యేక వస్త్రధారణలో కనిపించాడు.

ప్రతి ఏడాది చరణ్ అయ్యప్ప మాల విధిగా ధరించి ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటాడు.  కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు 41 రోజుల అయ్యప్ప దీక్షను పాటిస్తుంటాడు. ఈ ఏడాది కూడా 41 రోజుల పాటు నల్లని దుస్తులు ధరించి పాదరక్షలు లేకుండా సాధారణ భక్తుల్లాగే పూజలు చేస్తుంటాడు. ఇక RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మగధీర తర్వాత రామ్ చరణ్ రెండవసారి SS రాజమౌళితో కలిసి నటించారు. 300 కోట్ల అంచనాతో తెరకెక్కిన RRR ఇప్పటికే రూ. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మార్క్ కు చేరుకుంది. ఇక సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

 

  Last Updated: 04 Apr 2022, 04:35 PM IST