స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజర్ విషయంలో లెక్కలు తప్పాయి. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ను 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు దిల్ రాజు. ఐతే సినిమా పై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ సినిమాను దెబ్బ తీసింది. కలెక్షన్స్ కాస్త పుంజుకుంటున్నాయి అనుకునే టైం కి సినిమా హెచ్.డి ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది.
ఇలా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కు అన్ని రివర్స్ కొట్టాయి. ఐతే సినిమా భారీ నష్టాలు తప్పేలా లేవన్న క్లారిటీకి వచ్చారు దిల్ రాజు. ఇదిలాఉంటే రామ్ చరణ్ దిల్ రాజుకి మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమా వల్ల తీర్వంగా నష్టపోయిన దిల్ రాజుకి అభయం ఇచ్చినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం చరణ్ బుచ్చి బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ తో మరో సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమాల తర్వాత దిల్ రాజు సినిమా చేసేలా సంప్రదింపులు జరుగుతున్నాయి. అంతేకాదు ఆ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ లేకుండా నటిస్తానని హామీ ఇచ్చారట. మొత్తానికి రామ్ చరణ్ తన నిర్మాతకు సపోర్ట్ గా మరో సినిమా చేస్తానని చెప్పడం మెగా ఫ్యాన్స్ మెప్పు పొందింది. మరి రామ్ చరణ్ తో దిల్ రాజు చేసే సినిమాకు డైరెక్టర్ ఎవరు ఆ విశేషాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.