Ram Charan: బ్యాంకాక్ లో చిల్ అవుతున్న ఉపాసన, చరణ్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 06:45 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. ఈ జంటకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక గత ఏడాది ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయా. కూతురికి క్లిన్ కార అనే పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ అటు నటుడిగా, ఉపాసన ఇటు వ్యాపారవేత్తగా ఇద్దరూ బాగానే సంపాదిస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఉపాసన ఒక వైపు తన కూతురి బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి అలా వెకేషన్ కు వెళ్తూ ఉంటుంది ఉపాసన. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన రాంచరణ్ ఇద్దరు కలిసి బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్లారు.

వీరితో పాటు వీరి ఫ్రెండ్స్ మరో రెండు జంటలు కూడా వెళ్లారు. అందరూ కలిసి బ్యాంకాక్ లో చిల్ అవ్వడానికి సమ్మర్ వెకేషన్ గా ప్లాన్ చేసుకున్నారు. ఇక చరణ్ తో పాటు ఎప్పుడూ తన వెంటే ఉండే తన పెంపుడు కుక్కపిల్ల రైమ్ కూడా బ్యాంకాక్ కి వెళ్ళింది. చరణ్ వెకేషన్ కి వెళ్లేముందు ఫ్లైట్ లో చరణ్, రైమ్ కూర్చొని దిగిన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా రైమ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ట్రిప్ కి వెళ్లి అందరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసారు. ఈ ఫొటోలో చరణ్, ఉపాసన తో పాటు వీరి ఫ్రెండ్స్ బ్యాంకాక్ లో సముద్రం పక్కన ఉన్న ఒక రిసార్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలాంటి ట్రిప్స్ కి వెళ్తే ఉపాసన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.