Site icon HashtagU Telugu

Ram Charan: అంచనాలు పెంచుతున్న చెర్రీ సుకుమార్ మూవీ బడ్జెట్.. ఎన్ని వందల కోట్లో!

Mixcollage 22 Mar 2024 10 54 Am 1607

Mixcollage 22 Mar 2024 10 54 Am 1607

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా విషయంలో ప్రస్తుతం అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి ఒక్క చిత్రం కూడా రాలేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ నత్త నడకగా సాగుతోంది. కొన్ని సందర్భాల్లో చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై, నిర్మాత దిల్ రాజుపై అసహనం కూడా వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా చిత్రం ఒకటి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి ముందు నుంచి విపరీతమైన హైప్ ఏర్పడింది. రెహమాన్, జాన్వీ కపూర్ , శివరాజ్ కుమార్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ చిత్రంలో ఫిక్స్ అయిపోయారు. ఇంతలోనే రాంచరణ్ చిత్రం మరో క్రేజీ కాంబినేషన్ లో సెట్ అయింది అంటూ ప్రచారం జరుగుతోంది. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన సుకుమార్ మరోసారి చరణ్ తో జత కట్టబోతున్నట్లు స్ట్రాంగ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఆ రోజు RC 17 చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తారట. ఆల్మోస్ట్ రంగస్థలం సినిమాకి పనిచేసిన వాళ్లే ఈ చిత్రానికి కూడా ఉండబోతున్నారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్, చరణ్ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా సెలెబ్రిటీలు. కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం అంతే భారీగా ఉండాలి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి 250 కోట్ల బడ్జెట్ అని ప్రాథమికంగా అంచనా వేశారట. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఆగష్టు నుంచి సుక్కు ఫ్రీ అవుతారు. ఆ తర్వాత రాంచరణ్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కి తుది మెరుగులు ఉంటాయి.
ఇయర్ ఎండ్ నుంచి షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.