Site icon HashtagU Telugu

Ram Charan – NTR : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చరణ్,ఎన్టీఆర్ ఒకే వేదికపై.. హగ్ చేసుకొని.. ఇప్పటికైనా ఫ్యాన్ వార్స్ ఆపుతారా?

Ram Charan and NTR Meets after a Long Time and Hugged Each Other

Ntr Ram Charan

Ram Charan – NTR : RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. అయితే వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉన్నా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంటే మా హీరో అని ఇప్పటికి కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. RRR తర్వాత చరణ్, ఎన్టీఆర్ కూడా మళ్ళీ కలిసి కనపడకపోవడంతో ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయారు.

అయితే చాన్నాళ్ల తర్వాత చరణ్, ఎన్టీఆర్ కలిసి కనిపించారు. లండన్ లోని ఆల్బర్ట్ హాల్ లో RRR సినిమాని ప్రదర్శించారు. అలాగే ప్రెస్ మీట్, మ్యూజిక్ కాన్సర్ట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత ఎన్టీఆర్ – చరణ్ ఒకే వేదికపై కనిపించడంతో పలువురు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ కి వేదికపై అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి హగ్ చేసుకున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్టీఆర్, చరణ్ ఇలా క్లోజ్ గా ఉండటం చూసి చాన్నాళ్ళయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్ ఈ వీడియోలు చూసి సైలెంట్ అవుతారా చూడాలి మరి.

Also Read : Lokesh Kanagaraj : కమల్ & రజిని మల్టీస్టారర్.. ఇద్దరికీ కథ చెప్పిన లోకేష్ కనగరాజ్..