Ram Charan : సీతా.. రామరాజు.. మళ్లీ కలుస్తున్నారా.. స్క్రీన్ పై సూపర్ హిట్ జోడీ..!

Ram Charan తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న టైం లో అక్కడ హీరోయిన్స్ తెలుగు స్టార్స్ తో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ram Charan Again Pairing With Alia Bhatt

Ram Charan Again Pairing With Alia Bhatt

Ram Charan తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతున్న టైం లో అక్కడ హీరోయిన్స్ తెలుగు స్టార్స్ తో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఆఫర్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించని భామలంతా కూడా ఇప్పుడు తెలుగు ఆఫర్ అనగానే అలర్ట్ అవుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ క్రమంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ (Alia Bhatt) నటించింది. ఆ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన అలియా భట్ ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో కూడా ఇక్కడ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలియా తర్వాత దీపికా పదుకొనె (Deepika Padukone) కూడా తెలుగు లో నటిస్తుంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా చేస్తుంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత దీపిక తప్పకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత అలియా భట్ మరో తెలుగు సినిమా చేయలేదు. లేటేస్ట్ గా ఆ ఛాన్స్ మళ్లీ వచ్చిందని టాక్. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తోనే అలియా భట్ నటిస్తుందని తెలుస్తుంది.

బుచ్చి బాబు డైరెక్షన్ లో రాం చరణ్ చేస్తున్న పీరియాడికల్ సినిమాలో అలియా భట్ ని హీరోయిన్ గా లాక్ చేసినట్టు తెలుస్తుంది. మొదట ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా ఈ సినిమాలో అలియా భట్ ని ఫిక్స్ చేశారట. చరణ్, అలియా భట్ ఈ జోడీ మరోసారి మెగా ఫ్యాన్స్ ని అలరించనుంది.

Also Read : Teja Sajja Dulquer Salman Manchu Manoj : నెక్స్ట్ బిగ్ మల్టీస్టారర్ ఇదేనా..?

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఉప్పెనతో 100 కోట్ల వసూళ్లతో మొదటి డైరెక్టోరియల్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చి బాబు ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.

  Last Updated: 27 Jan 2024, 12:49 PM IST