Site icon HashtagU Telugu

Ram Charan : చరణ్ 3 డిఫరెంట్ రోల్స్.. మెగా ఫ్యాన్స్ హ్యాపీ..!

Chiranjeevi Ram Charan Mega Treat for Mega Fans Dasara Festival

Chiranjeevi Ram Charan Mega Treat for Mega Fans Dasara Festival

Ram Charan గ్లోబల్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఐతే సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన జరగండి సాంగ్ సెన్సేషన్ అవ్వగా సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు అన్నట్టు తెలుస్తుంది.

ఇక సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చింది. గేం చేంజర్ సినిమాలో చరణ్ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడట. అంటే త్రిపాత్రాభినయం కాదు కానీ ఒకే క్యారెక్టర్ 3 రకాల షేడ్స్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ వచ్చినా మెగా ఫాన్స్ హడావుడి మొదలవుతుంది. చరణ్ 3 డిఫరెంట్ రోల్స్ అని తెలుస్తుండగా ఇప్పుడు ఈ విషయంపై కూడా ఫ్యాన్స్ సూపర్ ఖుషి అవుతున్నారు.

గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే శంకర్ లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఈ సినిమా కూడా అదే తరహా ఫలితాన్ని అందుకుంటుందా అన్న భయం మెగా ఫ్యాన్స్ లో ఉంది. ఐతే మేకర్స్ మాత్రం అలాంటి భయాలు ఏమి అవసరం లేదని చెబుతున్నారు.

సినిమాలో చరణ్ మార్క్ యాక్షన్, డాన్స్ ఇంకా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఒక మంచి కమర్షియల్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. చరణ్ గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.