ఎనర్జిటిక్ స్టార్ రామ్ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా ఆ సినిమా కాస్త నిరాశపరిచింది. అందుకే ఒక ఆరు నెలలు గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. మహేష్ డైరెక్షన్ లో రామ్ హీరోగా ఒక సినిమా ఫిక్స్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా లాక్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా భాగ్య శ్రీ (Bhagya Sri) కి వరుస క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అమ్మడు విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది.
ఇప్పుడు రామ్ (Ram) సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఐతే ఈ సినిమా కూల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ సంగీత దర్శకుల ద్వయం వివేక్ మెర్విన్ లకు ఛాన్స్ ఇచ్చారు. 2012 నుంచి తమిళ సినిమాలకు సంగీతం అందిస్తున్న వీరు ధనుష్, నయనతార సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఐతే ఈ సినిమాలేవి వారికి బ్రేక్ తీసుకు రాలేదు.
పాన్ ఇండియా జోలికి వెళ్లకుండా..
రామ్ సినిమా కోసం డైరెక్టర్ మహేష్ వీళ్లని ఫిక్స్ చేశాడు. రామ్, భాగ్య శ్రీ జోడీ.. దానికి వివేక్ మెర్విన్ మ్యూజిక్ అదిరిపోతుందని అంటున్నారు. ఐతే ఈసారి పాన్ ఇండియా జోలికి వెళ్లకుండా తెలుగులోనే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ కూడా ఈసారి హిట్ టార్గెట్ గా ఈ సినిమా చేస్తున్నాడు.
రామ్ కు వరుస ఫ్లాపులు పడటం వల్ల కెరీర్ డైలమాలో పడింది. అందుకే ఈ సినిమాతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. రామ్ తో పాటు భాగ్య శ్రీకి ఈ సినిమా లక్కీగా మారనుందని చెప్పొచ్చు.
Also Read : Rishab Shetty : రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమా ఫిక్స్..!