Site icon HashtagU Telugu

Rakul Preet Singh: కెరీర్‏లో తొలిసారి అలాంటి పాత్రలో కనిపించనున్న హీరోయిన్ రకుల్?

Mixcollage 11 Feb 2024 01 10 Pm 3953

Mixcollage 11 Feb 2024 01 10 Pm 3953

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత నెమ్మదిగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేసి బాలీవుడ్ కి చెక్కేసింది. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియాలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. కాగా రకుల్ తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇక ఈ బ్యూటీకి అటు హిందీలోనూ ఆఫర్స్ వచ్చాయి. అక్కడ కూడా వరుస సినిమాలతో అలరించింది. కానీ హిందీలో ఆమెకు అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకుంది రకుల్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా లేదు. కేవలం మూవీ ఈవెంట్స్, పార్టీస్ అంటూ కాలం గడిపేస్తుంది. అలాగే ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది. ఇక ఈమె త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ సినీ ప్రయాణానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసిందని ప్రచారం నడుస్తోంది. అలాగే గత కొన్నాళ్లుగా ఎలాంటి ఆఫర్స్ లేకుండా సైలెంట్ గా ఉన్న రకుల్ కు, ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, నిర్మాత అల్లు అరవింద్ అంతా కలిసి ఈమూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుందని ప్రచారం నడుస్తుంది. అలాగే ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్ నటించనున్నారని.. హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని టాక్. అయితే ఈ మూవీలో కీలకమై శూర్పణఖ పాత్రను రకుల్ పోషించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version