Site icon HashtagU Telugu

Rakul Preet Singh Wedding : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌….?

Rakul Preet Singh Wedding

Rakul Wedding

ఢిల్లీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh )..పెళ్లి పీటలు (Wedding) ఎక్కేందుకు సిద్ధమైంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో పాటు టాప్ హీరోల సరసన జోడి కట్టి అలరించింది. ఆ తర్వాత కొత్త భామల రాకతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఇదే క్రమంలో పలు బిజినెస్ లు మొదలుపెట్టి..బిజీ అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో అమ్మడు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో పడింది. గత కొద్దీ రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ జంట..ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి కావాలని డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో రకుల్‌- జాకీ భగ్నానీల వివాహం జరగబోతుంది. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందట. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌, విందు పార్టీలు ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం రకుల్ పెళ్లి నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు రకుల్‌కు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే రకుల్ కానీ, జాకీ భగ్నానీ కానీ వారి కుటుంబ సభ్యులు ఈ పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన చేయలేదు. రకుల్‌ ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న అయలాన్‌, ఇండియన్‌ 2 సినిమాల్లో ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తోంది.

Read Also : Bairi Naresh : బైరి నరేష్‌ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు..ఎందుకంటే …!!