గొర్రెలను కంట్రోల్ చేయడం చాలా కష్టం : రకుల్ ప్రీత్ సింగ్ చిట్ చాట్!

రకుల్ ప్రీత్ సింగ్.. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. తెలుగు మూవీ ‘చెక్’ లో లాయర్ గా, హిందీ మూవీ ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ లో ఆర్కిటెక్ట్ గా విభిన్న పాత్రలు పోశించిన రకుల్.. మొదటిసారి గ్రామీణ యువతిగా నటించింది.

  • Written By:
  • Publish Date - October 7, 2021 / 12:28 PM IST

రకుల్ ప్రీత్ సింగ్.. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. తెలుగు మూవీ ‘చెక్’ లో లాయర్ గా, హిందీ మూవీ ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ లో ఆర్కిటెక్ట్ గా విభిన్న పాత్రలు పోశించిన రకుల్.. మొదటిసారి గ్రామీణ యువతిగా ‘కొండపొలం’ మూవీలో నటించింది. ఓబులమ్మగా తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతోంది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సందర్భంగా కొండపొలం షూటింగ్ విషయాలను మనతో పంచుకున్నారు రకుల్.

కొండపొలం షూటింగ్ సగభాగం అడవిలోనే షూట్ అవుతుంది. ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం దాదాపు 40 రోజుల పాటు దట్టమైన అడవిలో ఉండాల్సి వచ్చింది. మొదటిసారి గొర్రెల కాపారిగా నటించా. ఈ సినిమా ప్రధానంగా గొర్రెల చుట్టూ తిరుగుతుంది. గొర్రెలతో షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఏదైనా ఒక గొర్రె దారి తప్పితే.. మిగతా గొర్రెలన్నీ దానిని ఫాలో అయ్యేవి. నాకు, వైష్ణవ్ కు గొర్రెలను కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది.

కొండపొలం మూవీ నాకు ప్రత్యేకమైంది. ఈ మూవీ ‘జంగిల్ బుక్’ మాదిరిగా ఉంటుంది. ఓ నటిగా గ్రామీణ యువతి పాత్రలో నటించడం నాకు సవాల్ గా మారింది. సహజత్వం చాలా కష్టపడ్డాను. ఈ సినిమా కోసం ఫస్ట్ టైం రాయలసీమ భాష ను కూడా నేర్చుకున్నా. ఇతర సినిమాలు ఒప్పుకోవడం వల్ల డబ్బింగ్ మిస్ అయ్యాను. లేకపోతే రాయలసీమ భాషలో నా గొంతు వినిపించేది.

లాక్ డౌన్ తర్వాత నేను పాల్గొన్న అయిన మూవీ ఇదే. చాలారోజుల పాటు ఇంటికే పరిమితమైన నేను అడవుల్లో, అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేయడం వల్ల ఎంతో ఆనందించాను. గతంలో మంచి సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. కానీ ఓ నటిగా మాత్రం నేను ఫెయిల్ కాలేదు.