Rakul Preet Singh: గోల్ఫ్ క్లబ్ లో రకుల్ సందడి

క్యాన్సర్ పై అవగాహన కోసం మార్చి 5, 6 తేదీల్లో గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్ పోటీలు (గోల్కొండ)లో జరగనున్నాయి. క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ డైరెక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్

  • Written By:
  • Updated On - February 24, 2022 / 05:04 PM IST

క్యాన్సర్ పై అవగాహన కోసం మార్చి 5, 6 తేదీల్లో గోల్ఫ్ ఛాంపియన్‌షిప్ హైదరాబాద్ పోటీలు (గోల్కొండ)లో జరగనున్నాయి. క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ డైరెక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.దయాకర్ రెడ్డితో కలిసి బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈవెంట్‌ను హోస్ట్ చేశారు. రెండు రోజుల వ్యవధిలో మూడు సెషన్లలో 300 మందికి పైగా క్రీడాకారులు పోటీపడతారు. క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు సేకరించడం ఈవెంట్ లక్ష్యం. అందులో భాగంగా క్యాన్సర్ పేషెంట్ల కోసం నిధుల సేకరణే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జరగనుంది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఉదాత్తమైన అంశంతో అనుబంధం కలిగి ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది మరియు క్యూర్‌ ఫౌండేషన్‌ ద్వారా డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి అద్బుతమైన సేవ చేస్తున్నారు. భయంకరమైన వ్యాధికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో చేస్తున్న అద్భుతమైన కృషి మరియు సేవకు క్యూర్‌ ఫౌండేషన్‌ను నేను అభినందిస్తున్నాను. ఒకరికి జీవితాన్ని ఇవ్వగల సామర్థ్యాన్ని మించినది మరొకటి లేదు. ఈ ప్రపంచంలో మంచితనం ఉంది, దానిని మనం ఇక్కడ చూడవచ్చు, ప్రతి ఒక్కరు తమ సహకారంతో చాలా మంది జీవితాల్లో నవ్వులను మరియు ఆనందాన్ని తీసుకురాగలిగారు. కొన్నిసార్లు జీవితం చాలా అన్యాయంగా ఉంటుంది మరియు బహుశా మనలో ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడవచ్చు. క్యూర్‌ ఫౌండేషన్‌ రెగ్యులర్‌ చెకప్‌ల గురించి అవగాహన కల్పిస్తున్నది ఇది క్యాన్సర్‌ చికిత్స కోసం ముందుకు వెళ్లడానికి సరైన మార్గం మరియు ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు కూడా చికిత్స అందిస్తున్నది. ఇది మీరందరూ చేస్తున్న అద్భుతమైన పని మరియు దానిలో చిన్న భాగం అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

విజయ్‌ ఆనంద్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ గోల్ఫర్లు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, ఒపీనియన్‌ లీడర్ల సహకారంతో క్యాన్సర్‌పై మరింత విస్తృతంగా అవగాహనను కల్పిస్తూ నిధులను సమీకరించడం జరుగుతుంది. ఒక గొప్ప ఉద్దేశ్యం కోసం అందరూ ఒక్కటై తమ మద్ధతును తెలపడం ఎంతో అభినందనీయం. క్యూర్‌ ఫౌండేషన్‌ 2003 సంవత్సరంలో ప్రారంభించబడిరది మరియు దీని ద్వారా ఇప్పటివరకు 2000 మందికి పైగా నిరుపేదలైన రోగులకు, ముఖ్యంగా పిల్లలకు అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సలను అందించడంలో సహాయపడింది అని అన్నారు.