Site icon HashtagU Telugu

Rakul Preet Singh: ఆ విషయంలో పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటున్న రకుల్ ప్రీత్ సింగ్?

Mixcollage 13 Mar 2024 04 46 Pm 2823

Mixcollage 13 Mar 2024 04 46 Pm 2823

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు తెలుగులో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన రకుల్ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన ప్రియుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్ ఇన్ని రోజులు పెళ్లి వేడుక ఫొటోస్ పంచుకొని మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చేసింది.

పెళ్ళైనా కూడా అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా హాట్ ఫోటో షూట్ చేసింది రకుల్. లేలేత ప్రాయాన్ని చూపిస్తూ కెమెరా ముందు రచ్చ చేసి ఆ ఫొటోస్ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ మిర్చిలా సెగలు పుట్టిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలన్నీ చూసిన అభిమానులు పెళ్లయింది ఇప్పటికైనా కొంచెం మారు అంటూ కామెంట్స్ చేస్తుండగా పెళ్లి అయినా కూడా రకుల్ అందం ఏ మాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత ఎప్పటిలాగే ఆమె తన సినిమాల్లో, వెబ్ సీరిస్‌ల్లో నటించనుందట. ప్రస్తుతం భర్తతో కలిసి వెకేషన్ లోకి వెళ్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రకుల్ ఒకవైపు భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూనే మరోవైపు ఫోటోలకు హార్ట్ గా ఫోజులు ఇస్తుంది. మొన్నటికి మొన్న భర్తతో కలిసి ఒక డ్యాన్స్ వీడియోని చేసి అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version