Site icon HashtagU Telugu

Rakul Preet Singh: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Rakul Preet Singh

Rakul Preet Singh

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెరటం చిత్రంతో టాలీవుడ్‌కు, తడయార తాక్క చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో సరైన సక్సెస్‌లు లేక నిరాశ పడినా ఆ తరువాత దక్షిణాదిలో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద క్రేజ్‌ లేకపోయినా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వస్తనే ఉన్నాయి.

తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న అయలాన్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్‌ సరసన ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు పదుల వయసు దాటిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఇప్పుడు తన బాయ్‌ ఫ్రెండ్‌ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ బద్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు.

ఇటీవలే తన బాయ్‌ ఫ్రెండ్‌ గురించి బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు బాయ్‌ ఫ్రెండ్‌తో చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల తన పుట్టిన రోజును కూడా జాకీ బద్నానితో ఖుషీ ఖుషీగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక వధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తాజాగా తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి తనకు శాంతా ఇచ్చిన గిఫ్ట్‌ జాకీ అని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.