Site icon HashtagU Telugu

Drug Case : డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు అరెస్ట్..

Rakul Brother

Rakul Brother

హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. సుమారు రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ను నార్కోటిక్, SOT, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ (Rakul Preet Singh Brother Aman Preet Singh) కూడా ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సర్కార్ డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని..ఈ విషయంలో ఏక్కడ తగ్గొదని, డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్న వదిలిపెట్టకూడదంటూ కీలక ఆదేశాలు జారీ చేయడం తో నార్కోటిక్, SOT పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనికీలు చేపడుతూ పెద్ద సంఖ్యలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంలోనూ పెద్ద ఎత్తున డ్రగ్స్ పదార్దాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజేంద్ర నగర్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరుగుతుందనే పక్కా సమాచారం రావడంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ జరిపిన దాడుల్లో రకుల్ ప్రీతీ సింగ్ సోదరుడు అమన్ దీప్ నుంచి 2.6 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. అమన్ తో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మొత్తం ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డవారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ ఉండటం సంచలనం రేపుతోంది. అమన్ దీప్ వద్ద దాదాపు 30 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఆయన కుటుంబ సభ్యులే. ఆ 30 మంది సభ్యుల పేర్లను సైబరాబాద్ కమిషనర్‌కు అందజేశారు. గతంలో డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే.

Read Also : CEO of Wedding : రాధికా మర్చంట్ ఇంటర్వ్యూ.. నీతా అంబానీ గురించి ఏమన్నారంటే..