Site icon HashtagU Telugu

Rakul Preet Singh : గడ్డకట్టే మంచులో బికినిలో స్నానం చేసిన రకుల్.. చలిలో వేడి పుట్టిస్తుందిగా..

Rakul Preet Singh bath in -15 degrees video goes viral

Rakul Preet Singh bath in -15 degrees video goes viral

కెరటం(Keratam) సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. సౌత్ లో(South) స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్(Bollywood) లో ఆఫర్ రావడంతో అక్కడికి చెక్కేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ కొట్టేస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్.

 

తాజాగా రకుల్ ప్రీత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రకుల్ మంచు పర్వతాల్లో ఉంది. మంచు పర్వతాల మధ్య ఉన్న నీళ్ళల్లో బికినీతో స్నానం చేసింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. అయితే ఇది క్రయో థెరపీ అనే ఒక ప్రక్రియ అని, -15 డిగ్రీల చలిలో ఇలా నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరానికి మంచిదని చెప్తుంది రకుల్.

సినిమా షూట్ కోసం వెళ్లగా అక్కడ మంచు పర్వతాల్లో ఇలా హెల్త్ కి మంచిదని రకుల్ స్నానం చేసినా, బికినీలో ఉన్న వీడియో పోస్ట్ చేయడంతో చలిలో కూడా వేడి పుట్టిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ఇలా బికినీ వీడియో షేర్ చేయడంతో ఫుల్ వైరల్ అయి ఆ క్రయోథెరపీ గురించి కూడా తెలుసుకుంటున్నారు అభిమానులు, నెటిజన్లు. మరి మీరేమన్నా ఇలా గడ్డ కట్టే చలిలో స్నానం ట్రై చేస్తారా?

 

Also Read :  Kavya Thapar : కుర్రకారుని హాట్ షోతో కలవరపెడుతున్న కావ్య తాపర్