రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ అగ్రనాయికల్లో ఒకరుగా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ…సందడి చేస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మ సినిమాలు ఏవీకూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ ఏడాది తన బాయ్ ఫ్రెండ్ జాకీని పరిచయం చేసింది రకుల్.
సినిమాలు ప్లాపవుతున్న తరుణంలో ….ఆ ప్రభావం తనమీద పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఓ ప్రైవేట్ వీడియో సాంగ్ ను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది. ఈ వీడియో లో రకుల్ లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో రకుల్ మల్టీ లుక్స్ ట్రై చేసింది. ప్రేక్షులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ పాటలో కనిపించేందుకు రకుల్ ఇప్పటివరకే ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో రకుల్ డాన్స్ చాలా సెక్సీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
