Rakul Comments on Nepotism : నెపోటిజం (Nepotism ) ..ఇది కొత్తదేం కాదు..అంతటా ఉండేది..కాకపోతే చిత్రసీమ నటీమణులు దీనిపై కామెంట్స్ చేస్తే మాత్రం అంత మాట్లాడుకోవడం..వైరల్ చేయడం చేస్తుంటారు. తాజాగా ఢిల్లీ భామ రకుల్ ప్రీతీ సింగ్ (Rakul Preet Singh) నెపోటిజం ఫై షాకింగ్ కామెంట్స్ చేసింది. వేంకటాద్రి ఎక్సప్రెస్ మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్..ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ అందుకొని వరుస ఛాన్సులు కొట్టేసింది. మహేష్ బాబు , రాంచరణ్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ఇలా యంగ్ హీరోలందరి పక్కన జోడి కట్టి అభిమానులను అలరించింది. ఆ తర్వాత కొత్త భామల ఎంట్రీ తో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి. ఇదే క్రమంలో పలు బిజినెస్ చేసి చేతులు కాల్చుకోవడం తో ఇక జాకీ భగ్నానీ అనే వ్యక్తితో రకుల్ ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.
ఇదిలా ఉంటే రకుల్ తాజాగా నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే. అవకాశాలు కోల్పోయానని నేను ఎప్పుడు బాధపడలేదు. నా తండ్రి సలహాలు, సూచనలు నాకు చాలా నేర్పించాయి. కొన్ని విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఛాన్స్‌లు మిస్ అవ్వడం అనేది మన లైఫ్‌లో ఒక పార్ట్. మనకు దక్కని వాటి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. నేను వ్యక్తిగతంగా ఎదగడం కోసం మాత్రమే ఆలోచిస్తాను. కానీ ఒక స్టార్ కిడ్‌కు వచ్చినన్నీ అవకాశాలు మిగతావారికి రావడం కష్టమంటూ నెపోటిజంపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
Read Also : Padi Kaushik Reddy : ఎమ్మెల్యే ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య – హరీష్ రావు